ఆర్మూర్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆర్మూరు ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప సర్పంచ్ నడుకూడా శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.
షాది ముబారక్ లబ్దిదారులు అతియ బేగం, యాసిన్ బేగం, అలాగే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఎడ్ల గంగవ్వ, దాసరి లక్ష్మి, మంగళవారం సత్య గంగు, సీఎం రిలీఫ్ ఫండ్ సట్ల రంజిత్ 7 వేలు, ఎలుక స్వరవీన 15 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. లబ్దిదారులు సీఎం కెసిఆర్‌కు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దాసరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.