కామారెడ్డికి మంచిరోజులొచ్చాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు మంచి రోజులొచ్చాయని, రాబోయే 3,4 సంవత్సరాలలో ఊహ్కించని విధంగా జిల్లా సమగ్రాభివృద్ధితో దూసుకుపోతోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్‌ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో పరిణిక హోటల్‌లో బస చేసిన మంత్రిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా పశు సంవర్ధక అధికారి సింహరావు, మత్స్య శాఖాధికారి వరదా రెడ్డి, ఆర్‌.డి.ఓ. శ్రీనివాస్‌ రెడ్డి, పాడి అభివృద్ధి మేనేజర్‌ శ్రేనివాస్‌, దేవేందర్‌, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. మానిఫెస్టోలో లేకున్నా పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు అమలు చేస్తూ పలు అవార్డులు, రివార్డులతో దేశం రాష్ట్రం వైపు చూసేలా చేశారని అన్నారు.

రైతులకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు రైతన్నలకు రైతుబంధు, రైతు భీమా, సాగునీరు అందిస్తూ మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ఆర్ధిక సహాయం అందిస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్దులు, వితంతువులు, బీడీ,చేనేత కార్మికులు తదితరులకు 2,016 దివ్యంగులకు 4,016 ఆసరా పింఛన్లు అందిస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌ ద్వారా ఒక లక్ష 116 అందిస్తున్న రాష్ట్రం మనదేనని అన్నారు.

మన ఊరు మన బడి క్రింద ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగాప్రభుత్గ్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచుటకు వేయి కోట్లతో పలు కార్యక్రామాలు చేపట్టామని, వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలు, రొయ్యలు చెరువులో వదిలామని, మత్స్య సంపద బాగా పెరిగిందని, చేపల మార్కెట్‌ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని పండుగలకు సమప్రాధాన్యమతనిస్తూ పేద ప్రజలు పండుగలు సంతోషం జరుపుకోవాలని గిఫ్‌ ప్యాకెట్లు, తోఫా లు, బతుకమ్మ చీరలు అందజేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారన్నారు.

జిల్లాలో పట్టణ అభివృద్ధి పధకం క్రింద 100 కోట్లతో పలు కార్యక్రామాలు చేపట్టామని, అదేవిధంగా పల్లె ప్రాతి క్రింద ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ అందించామని, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేశామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, నేడు భూముల విలువ ఎంతో పెరిగిందని అన్నారు.

8 కొట్లతో ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రతిపక్షాలు సానుకూల దృక్పధంతో చూడడం లేదని ఎద్దేవ చేశారు. 50 ఇండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏమి చేయకున్నా, మరొక్కసారి ఛాన్స్‌ ఇవ్వమని అడగడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి నియోజక వర్గం నుండి పోటీ చేయనుండడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని, గజ్వెల్‌ తరహాలో భవిష్యత్తులో ఇక్కడ యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతాయని, అద్భుత ప్రగతి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »