జక్రాన్పల్లి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జక్కం కార్తీక్ను జక్రాన్ పల్లి ముదిరాజ్ నాయకులు గురువారం సన్మానించారు. ఈసందర్భంగా జక్రాన్పల్లి గ్రామంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు.
సమావేశానికి చోప్పరి శంకర్ తెలంగాణ ముదిరాజుల అధ్యక్షులు చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జక్కం కార్తీక్ను సన్మానించారు. సంవత్సరాలుగా ముదిరాజులపై జరుగుతున్న దాడులపై కొట్లాడుతున్న ముదిరాజ్ యువతకు పాదాభివందనాలు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ముదిరాజ్ యువ నాయకులు బొంబాయి రాజు, సోప్పరి వినోద్, బొంబాయి మహేందర్, జక్కం అశోక్, సుధీర్, సున్నం గంగ ప్రసాద్, ప్రశాంత్, నాగరాజు, జాన్సన్, వెంకటేష్, లక్ష్మణ్ కుమార్, సాయి చరణ్, దిలీప్, తాళ్ల సాయిల, ప్రేమ్ కుమార్, రాజేశ్వర్, ముదిరాజ్ యువజన నాయకులు పాల్గొన్నారు.