కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో అంగన్వాడిలు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైందని, వారికి కావలసిన ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాద బీమా వర్తింప చేయడం వారి న్యాయమైన డిమాండ్లు అని అన్నారు.
ప్రభుత్వం వెంటనే అంగన్వాడిలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని అన్నారు. అంగన్వాడిల సమస్యలు పరిష్కారమయ్యేవరకు తమకు మద్దతుగా ఉంటామన్నారు.