ఆర్మూర్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16వతేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో భారత రాజ్యాంగ పిత, విశ్వరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితం-ఆశయాలు-లక్ష్యాలు పై హైదరాబాద్ లోని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ ప్రదర్శింపబడుతుంది.
సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంత భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో ప్రదర్శింపబడుటకు అనుమతులు ఇచ్చింది.
అందులో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్‌లోని క్షత్రియ ఫంక్షన్ హాళ్ళో జరగబోయే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.