కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పట్టణంలోని ఆర్.కె. కళాశాలలో జరుగుచున్న టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నా విధానాన్ని నిశితంగా పరిశిలించారు. చీఫ్ సూపరింటెండెంట్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని 24 కేంద్రాలలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టెట్ ) మొదటి పేపర్, రెండవ పేపర్ అన్ని పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. మొదటి పేపర్‌కు 5,535 మంది అభ్యర్థులకు గాను 4,700 మంది హాజరు కాగా 835 మంది గైర్ హాజరయ్యారని అన్నారు.
కాగా రెండవ పేపర్ కు 4,205 అభ్యర్థులకు గాను 3,971 మంది హాజారుకాగా, 234 మంది గైర్ హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, ఆదర్శ పాఠశాలల అదనపు సంచాలకులు, రాష్ట్ర పరిశీలకులు సరోజినీ దేవి, డిఈఓ రాజు, పరీక్షల సహాయ సంచాలకులు నీలం లింగం కూడా పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.