బాన్సువాడ, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్ మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శివా బాయ్ ఇటీవల మంజీరా నదిలో పడి ప్రమాదవశత్తు మృతి చెందడంతో శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల పార్టీ బీమా చెక్కును సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.