ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చుతుంది

బాన్సువాడ, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వానిజి అన్నారు. సోమవారం ఏఐసిసి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్‌ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికారసూల్‌ వానికి పర్యటించి ఆరు గ్యారెంటీ హామీల గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ ఇచ్చిన మాట నెరవేరుస్తుందని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలను కర్ణాటకలో ప్రజలకు హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న దోపిడి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించాలన్నారు.

ఈ సందర్భంగా కిరాణా షాపుల నిర్వాహకులకు 6 గ్యారంటీ హామీలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా రుద్రూర్‌ మండల కేంద్రానికి విచ్చేసిన వికార్‌ రసూల్‌ వానిజీని కాంగ్రెస్‌ నాయకులు శాలువా పూలమాలతో సత్కరించారు.

కార్యక్రమంలో పిసిసి డెలిగేట్లు వెంకటరామిరెడ్డి, కూనిపూర్‌ రాజారెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు మాసాని శ్రీనివాస్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, మండల అధ్యక్షుడు తోట అరుణ్‌, సంజీవరెడ్డి, రెడ్డి రాంబాబు, తులసి రామ్‌, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »