వేల్పూర్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన షేక్ గఫార్ 2019 జూన్ నెలలో సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడి యాజమాని మూడు నెలలపాటు జీతం ఇవ్వకపోవడంతో, అక్కడినుండి పారిపోయి రోజువారి కూలిగా మారాడు. కొంత కాలం పని చేసి సంపాదించిన డబ్బు 60 వేల రూపాయలు అక్కడే పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి చేతికి ఇచ్చి ఎలాగైనా ఇంటికి పంపాల్సిందిగా కోరాడు.
అందుకు సరేనన్న ఆ వ్యక్తి డబ్బు తీసుకొని కనిపించకుండా పోయాడు. దిక్కుతోచని గఫార్ కుటుంబ సభ్యులకు మొరపెట్టుకొని ఎలాగైనా ఇంటికి రప్పించాల్సిందిగా ఏడుస్తూ వీడియో పంపాడు. వారు కోటపాటి నర్సింహారెడ్డిని కలిసి వివరాలు తెలుపగా, గఫార్‌ను స్వదేశానికి రప్పించడానికి అక్కడి ఇండియన్ ఎంబసి, మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా పంపించారు. సౌదీలోని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఇఫ్తెకర్ అలీ సహకారంతో ప్రయత్నిస్తామన్నారు.