కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 వరకు వచ్చే అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరోల్ ను ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తుది ఓటర్ల జాబితాను రూపొందించడం బి ఎల్ వోల బాధ్యత కాదని, వారితో పాటు ప్రజలు, పార్టీలకు చెందిన ఏజెంట్లు భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఈఆర్వోలను, ఏఈఆర్ఓ లను నియమించినట్లు తెలిపారు. మొబైల్ వాహనం ద్వారా ఈవీఎం, వీవీ ప్యాట్ల్ పై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.