డిచ్‌పల్లి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బిఏ, బీకాం, బీఎస్సీ రెండవ మరియు నాలుగవ సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ విశ్వవిద్యాల రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి బుధవారం విడుదల చేశారు.
రెండవ సెమిస్టర్‌లో బాలురు 3696 మంది కాగా బాలికలు 5289 మందితో కలిపి 8985 మంది హాజరయ్యారన్నారు. ఇందులో 11.96 శాతంతో 442 మంది బాలురు, 36 శాతంతో 1904 మంది బాలికలు మొత్తం 26.11 శాతంతో 2346 మంది ఉత్తీర్ణులైనారని తెలిపారు.
అదేవిధంగా నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో 4231 మంది బాలురు 5708 బాలికలు మంది మొత్తం 9939 మంది హాజరు అయ్యారన్నారు. ఇందులో (17.02 శాతం) 720 మంది బాలురు (45.36 శాతం) 2589 మంది బాలికలు మొత్తంగా (33.29 శాతం) 3309 మంది ఉత్తీర్ణులైనారని చెప్పారు.
పై రెండు సెమిస్టర్‌లో కూడా బాలికలదే పై చేయి కావడం గమనించదగ్గ విషయం. ఈ సందర్భంగా పారదర్శకంగా వేగవంతంగా ఫలితాలను అందించడంలో మార్గ నిర్దేశనం చేసిన కంట్రోలర్ ఆచార్య అరుణని అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయితో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయ గౌడ్, పరీక్షల విభాగ సిబ్బందిని రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అభినందించారు.