మోర్తాడ్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన వారికి శనివారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు 14 లక్షల 89 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం రిలీఫ్ పండ్ మంజూరు చేయించినందుకు వారు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిరుపేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, అజార్, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.