కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్ రాజేందర్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్ సైట్ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్ సైట్ ప్రెసిడెంట్ బానోత్ నరేష్ నాయక్ తెలిపారు.