కామారెడ్డి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రిషిక (24) మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు ముందుకు వచ్చి మానవతా ద ృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరం అయినప్పుడు ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా సహకరిస్తామని, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
రక్తదానం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చునని, రక్తదానం చేయాలనుకున్నవారు 9492874006 కి సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, నవీన్, లక్ష్మణ్, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.