బాన్సువాడ, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మందిరాల వాస్తు ప్లానర్ మరియు ఇంజనీర్ శివకాంత్ కూనీపూర్ గ్రామంలో స్థలం పరిశీలించి శివాలయ నిర్మాణం కొరకు భూమిపూజ చేసి ముగ్గు పోశారు.
సుమారు 35 లక్షల రూపాయలు అంచనాతో గ్రామస్థులు మందిర నిర్మాణం చేపడుతున్నారు. మల్లారం పిట్ల కృష్ణ స్వామి మహారాజ్ ఆశీస్సులతో గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వెళ్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.