ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 72 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.

ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండిరగ్‌ ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ వివరణ అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయన్న, కలెక్టరేట్‌ ఏవో మసూర్‌ అహ్మద్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »