బాన్సువాడ, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 17రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడి ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మొద్దు నిద్ర వహిస్తుందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను విరమించేది లేదని అందరం ఐక్యంగా ఉండి పోరాడి మన హక్కులను సాధించుకుందామన్నారు.
కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు మహాదేవి, శివగంగా, రేణుక, అనసూయ, లక్ష్మి, విజయలక్ష్మి, సరిత, అనురాధ, సవిత అంగన్వాడి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.