బాన్సువాడ, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కోణాల గంగారెడ్డి, కొండని గంగారం, తుప్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.