వర్ని, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలం కూనిపూర్ గ్రామంలో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయం భయంగా బిక్కుబిక్కుగా గడుపుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం చిరుత పులి మేకను, గొర్రెను తిన్నట్లు గొర్రె కాపర్లు తెలిపారు. గతంలో కూడా ఒక పులి పిల్ల తప్పిపోయి గ్రామంలోకి రావడం వల్ల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అప్పగించినట్లు వారు తెలిపారు.
ఇట్టి విషయమై సంబంధిత అటవీ శాఖ అధికారి పద్మారావును వివరణ కోరగా చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందిని సంఘటన స్థలికి పంపి వివరాలను సేకరిస్తున్నట్లు అలాగే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా ఎవరు వెళ్ళవద్దని అవసరం ఉంటేనే గుంపులుగా వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రాణా నష్టం జరగదన్నారు.
ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వన్యప్రాణుల భారీ నుండి సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలన్నారు. అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం వివరాలు తెలిసినట్లయితే అటవీ శాఖ సిబ్బందికి తెలియజేయాలని ఆయన సూచించారు.