నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత…ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ అన్నారు.
ఆదివారం ‘‘ఏక్ తారిఖ్ ఏక్ ఘంటా ఏక్ సాత్’’ స్వచ్ఛత హి సేవలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ మరియు గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో గల దుబ్బా ఏరియాలో శ్రమదానం చేపట్టారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ…స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమం అని గాందీజి కలలుగన్న స్వచ్చమైన భారత దేశం నిర్మాణంలో స్వచ్చతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషింస్తునదని తెలిపారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరూ విధిగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు.

అలాగే గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. స్వచ్ఛత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తలేని భారతదేశం నిర్మించాలన్నారు. పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. ప్రతీ విద్యార్థి గ్రామ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛత తోనే స్వస్థత చేకూరుతుందని, అందుకే ప్రతి ఒక్కరు స్వచ్ఛతను తమ సొంతం చేసుకొని, నిరంతరం పాటించాలన్నారు.
అందులో భాగంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్ సిసి వాలింటర్ లు దుబ్బా ఏరియాలో యూనిట్‌లగా విడిపోయి శ్రమదానం చేశారు. శ్రమదానంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం.కుమార్ స్వామి, డాక్టర్ ఎం.సునీత, డాక్టర్ బి.సుమలత, డాక్టర్ పి.రవిరాజ్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ అంబర్ సింగ్, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.ప్రభాకర్, ఎన్ సిసి కెప్టెన్ డాక్టర్ బాబురావు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వాలంటీర్‌లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎఫ్ పిఏ ఎం.ఏ.రషీద్, సిబ్బంది బాలయ్య, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.