కామారెడ్డి, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, ఆనాటి నుండే ఎన్నికలలో అభ్యర్థుల వ్యయ నియంత్రణను మానిటరింగ్ చేయుటకు కమిటీ సమాయత్తం కావాలన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిచే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, సర్వైవల్ స్టాటిస్టికల్ టీమ్, వీడియో సర్వైవల్ టీమ్, వీడియో వీవింగ్ టీములకు సంబంధించిన సహాయ వ్యయ పరిశిలకులను నియమించుటకు ఏర్పాటు చేసిన కమిటీలకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు సరైన శిక్షణ పొంది ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేయాలని, అందుకు తగిన విధంగా శిక్షణ, అవగాహన పొందాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఎవరూ అతిక్రమించకుండా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహ రెడ్డి, సిపిఒ రాజారామ్, జిల్లా అడిట్ అధికారి కిషన్, డిపిఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ. మైసూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.