నిజామాబాద్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు కోట్ల నిధులు, అదే విధంగా రైల్వే లైన్ డబ్లింగ్ వంటి గొప్ప పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా చేశారన్నారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు విత్తనాలు చల్లడం నుంచి మొదలుపెట్టి ఎక్స్పోర్ట్ వరకు ఎంతో లబ్ది చేకూరుతుందన్నారు. పసుపు బోర్డు పై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిరచారు.
ఎంపీ అర్వింద్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలతో ఏ ఒక్క హామీ అయిన నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. రైతులకు మంచి చేసినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ అర్వింద్‌ని అభినందించాలన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు కల సాకారం చేసి ఎంతో మంది పసుపు రైతులకు భరోసా కల్పించిన ‘‘పసుపు బోర్డు’’ తేవడానికి ఎంపీ అర్వింద్ చేసిన కృషి మరువలేనిది అన్నారు.
2030 నాటికి పసుపు ఎగుమతిలో బిలియన్ల లక్ష్యంతో పని చేస్తోందన్నారు. గిరిజనుల చిరకాల వాంఛ అయిన ఉన్నత విద్యను లక్ష్యము మరియు ఆశయములు అందించే సమ్మక్క-సారక్క యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం ఎంతో గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రభుత్వమే బిజెపి అన్నారు.
సమావేశంలో బీజేపీ ఐటీ విభాగం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ ఈగ ఆశిష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాగారెడ్డి, బీజేపీ బీసీ మోర్చా జిల్లా కోశాధికారి ఆప్కారి రాజన్న, బీజేపీ నాయకులు హరీష్ కుమార్ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.