తెలంగాణ వచ్చాక వైద్య రంగం బలోపేతమైంది

బిచ్కుంద, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం చక్కటి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంఖు స్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కి.సి.ఆర్‌. వచ్చాక తెలంగాణా రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతమయ్యిందని, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలతో పటు, ప్రతి నియోజక వర్గంలో వంద పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల, హైదరాబాద్‌ లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుతో పేదలకు వైద్యం చేరువయ్యిందని అన్నారు. ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వసుతాయన్నారు.

బిచ్కుందలో ఇదివరకే డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేశామని తద్వరా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని అన్నారు. .గత పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న వారే నేడు పోదాం పద ప్రభుయేత్వా దవాఖానకు అనేంత గొప్పగా ప్రభుయేత్వాసుపత్రులను తీర్చిదిద్దామని అన్నారు. నాడు ప్రభుత్వాసుపత్రులల్లో 30 శాతం ప్రసవాలు జరుగగా నేడు 76. 8 శాతం జరుగుచున్నాయని అన్నారు. నాడు 30 ప్రభుత్వ, 70 ప్రైవేట్‌ ఆసుపత్రులుండగా నేడు 76 ప్రభుయేత్వా, 24 ప్రైవేట్‌ ఆసుపత్రులున్నాయని, ఇది కి.సి.ఆర్‌. దక్షతకు నిదర్శనమని అన్నారు. నాందేడ్‌ లో 40మంది పిల్లలు మూడురోజుల్లో పిట్టల్లా రాలిపోతున్నారని, డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న రాష్ట్రంలో సూదులు లేవు, మందులు లేవు, గోళీలు లేవని ఎద్దేవా చేశారు.

కేంద్రం దేశంలో 157 మెడికల్‌ కళాశాలలు ఇవ్వగా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని అయినా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను మంజూరు చేశారని రాబోయే కాలంలో ఏటా 10 వేల మంది డాక్టర్లను దేశానికి అందించనున్నామని అన్నారు. కె .సి.ఆర్‌.నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాగిస్తున్నదని అన్నారు. మంచిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మునిసిపాలిటీ, వైద్య రంగం, పరిశ్రమల రంగం, ఐ.టి. తదితర రంగాలలో కేంద్రం ఢల్లీిలో అవార్డులు ఇచ్చి గాలిలో తిడుతున్నారని అన్నారు. స్తానికంగా ఉండే కెసిఆర్‌కు తెలంగాణ పట్ల ఉన్న అవగాహన, టూరిస్ట్‌ నాయకులకు ఉండదని, పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ రోజే సి.ఏం. బ్రేక్‌ ఫాస్ట్‌ పధకం రాష్ట్రమంతటా ప్రారంభించామని, 20 లక్షల మంది పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ దఫెదర్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎం.పి. బీబీపాటిల్‌, శాసనసభ్యులు హనుమంతు షిండే, వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »