బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసింది

బాన్సువాడ, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ చైర్మన్‌ అబ్దుల్లా సోహేల్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పొలిటికల్‌ అఫ్ఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సూచనమేరకు టీపీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజు సారథ్యంలో శుక్రవారం బాన్సువాడ పట్టణంలో జమా మస్జిద్‌ (మర్కాస్‌) వద్దా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనారిటీ పట్ల అవలంబిస్తున్న వైఫల్యాలను సియాసత్‌ ఉర్దూ పేపర్‌లోని పేపర్‌ కటింగ్లను కరపత్రాల రూపంలో మైనార్టీలకు పంచిపెట్టారు.

ఈ సంద్భంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ చైర్మన్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖలేక్‌ , జిల్లా మాజీ కోఆప్షన్‌ సభ్యులు అలి బిన్‌ అబ్దుల్లా , బాన్సువాడ బ్లాక్‌ ఏ అధ్యక్షులు అసద్‌ బిన్‌ మోసిన్‌, బాన్సువాడ మండల మైనారిటీ అధ్యక్షులు నబి, బాన్సువాడ పట్టణ మైనారిటీ అధ్యక్షులు అఫ్రోజ్‌, మాజీ వార్డ్‌ సభ్యులు అక్బర్‌ , జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు షాహబ్‌ మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనారిటీలకు 100 కోట్లు మంజూరీ చేస్తూ జీఓ ఇచ్చి కేవలం 20 కోట్లు విడుదల చేశారని, జిల్లా కలెక్టర్లు మైనారిటీ వెల్ఫేర్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి కూడా సక్రమంగా లబ్ధిదారులకు అందలేదన్నారు.

కేసిఆర్‌ ప్రభుత్వం ఏర్పడగానే 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని 2014 ఎన్నికల్లో చెప్పి మోసం చేయడం జరిగిందనీ, గతంలో జరిగిన ఆసిఫాబాద్‌ సభలో ఒక వ్యక్తి 12 శాతం రిజర్వేషన్‌ ఏమైందని అడగగా మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బైటో బైటో తుమాకో బోలుంగ తుమారే బాప్కుబీ బోలుంగ అనే మాటలు మైనారిటీ సోదరులు ఎన్నటికీ మరువలేరని వక్ఫ్‌ బోర్డ్‌కు కూడ జ్యుడీషియల్‌ పవర్‌ ఇస్తానని చెప్పి మోసం చేశారని, కేవలం కేసీఆర్‌ మైనారిటీలను మభ్య పెట్టాలని చూస్తున్నారనీ రాబోయే ఎన్నికల్లో సెక్యులర్‌ పార్టీ అయినా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్‌ అజీమ్‌, మన్నాన్‌, సలీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »