ఆర్మూర్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి హాజరయ్యారు. చిట్టి బతుకమ్మ ఉత్సవ వేడుకలో భాగంగా శాస్త్రోపేతంగా పాఠశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు.
సాంప్రదాయ దుస్తులలో విద్యార్థినిలు పాఠశాలకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను ఒక దగ్గర పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా గడపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతూ కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఘనంగా నిర్వహించబడే పండగ బతుకమ్మ పండగని వారు అన్నారు.
ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తూ పండగ యొక్క విశిష్టతను పూర్వపరాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. జానపద భక్తిగీతాలతో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో శమి పూజ, వాహన పూజ, ఆయుధ పూజ మరియు రావణ దహనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.