ఆర్మూర్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బస్టాండ్ నిత్యం అనేక మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. బస్ వచ్చేంత వరకు ఎదిరి చూసే ప్రయాణీకులలో పురుషులకు, మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ బాధ ఎవరితో చెప్పాలని ఆవేదన చెందుతున్నారు.
ఆర్మూర్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఇటీవల బస్టాండ్‌కు నూతనంగా ముత్రశాలలను మరుగుదొడ్లను మరమ్మత్తులు చేస్తున్న సందర్భంగా వాటిని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి ప్రయాణీకుల సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేయాలని, నిత్యం రద్దీగా ఉండే బస్టాండును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని శుక్రవారం డిపో మేనేజర్‌ను ప్రయాణీకులు వేడుకున్నారు.