డిచ్‌పల్లి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు.
ఫిజికల్ హాండికాప్స్ (భౌతిక వికలాంగులు) అర్హత గలవారు ఐదుగురు (05) అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ (సిఎపి) అర్హత గలవారు ఒక్కరు (01) అభ్యర్థి హాజరైనారని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు ఎన్‌సిసి, ఎక్ష్ట్రా కరికులం (సహ పాఠ్యాంశాల ప్రావీణ్యం) అర్హత గలవారు తమ తమ విద్యార్హత, స్పెషల్ కేటగిరికి చెందిన ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు సెట్లు జిరాక్స్ ధ్రువ పత్రాలు తీసుకొని రావలసిందిగా ఆయన కోరారు. ఇందులో ఆడిట్ సెల్ జూనియర్ అసిస్టెంట్స్ అశోక్, నరేశ్ పాల్గొన్నారు.