నిరంతర పర్యవేక్షణ ఉండాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో సి -విజిల్‌ యాప్‌, ఈ-సువిధ, వ్యయ నియంత్రణ, మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ పనితీరును ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించారు.

అనంతరం నోడల్‌ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల ఉల్లంఘనపై 1950 టోల్‌ ఫ్రీ నెంబరు, ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 8468223060, విజిల్‌కు వచ్చే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదు అందిన వంద నిముషాలలో పరిష్కరించాలన్నారు. ఎన్నికలలో జరిగే అక్రమాలు, కోడ్‌ ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేయుటకు ఎన్నికల సంఘం సి -విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టిందని కంట్రోల్‌ రూమ్‌లో 24 I 7 పనిచేసే ఈ టీమ్‌ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందంతో అనుసంధానమై ఫిర్యాదు వచ్చిన వంద నిముషాలలో దర్యాప్తు చేసి ఫిర్యాదుదారునికి సమాచారమందిస్తుందని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతుందని అన్నారు.

సి-విజిల్‌ యాప్‌ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ నందు డౌన్‌లోడ్‌ చేసుకొని కోడ్‌ ఉల్లంఘణకు సంబంధించిన ఫోటో ఒకటి తీసి దానిని యాప్‌లో అప్లోడ్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ యాప్‌ ద్వారా ఎవరైనా డబ్బు ఆశ చూపినా, ప్రలోభ పెట్టినా, మద్యం సరఫరా చేసినా నేరపూరిత చర్యలతో భయ బ్రాంతులకు గురి చేసినా, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రవాణా చేసినా, మతపరమైన ప్రసంగాలు చేసిన, తప్పుడు వార్తలు, పెయిడ్‌ వార్తలు వంటి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగినట్లు భావించిన వాటికి సంబంధించిన ఫొటో లేదా వీడియో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఇలాంటి కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్‌లోడ్‌ చేయవచ్చన్నారు.

ఏం.సి.ఏం.సి. కమిటీ సభ్యులు వివిధ వార్తాపత్రికలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులు సకాలంలో ఇవ్వాలని సూచించారు. చెల్లింపు వార్తలు, అనుమతులు లేకుండా టి.వి.లలో ప్రసారం అయ్యే వాటికి, సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలకు వెంటనే స్పందించాలన్నారు.

ప్రతి ఒక్కరు ఎన్నికల విధివిదానాలను సూచించే పుస్తకాలను పవిత్రగ్రంధాలుగా బావించి పూర్తిగా చదివి తమ విభాగానికి సంబందించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సమావేశంలో నోడల్‌ అధికారులు కిషన్‌, సురేందర్‌ కుమార్‌, శాంతికుమార్‌, సతీష్‌ యాదవ్‌, శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »