కామారెడ్డి, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలులో ఉండడం, అధికారులు నోడల్ అధికారులుగా వివిధ రకాల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినదని ఆయన తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.