బాన్సువాడ, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు కాసుల బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని హన్మజిపెట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరిస్తున్నారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు కానీ హామీలను ఇచ్చి మోసం చేయడంలో దిట్ట అని, తెలంగాణ ఏర్పడి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేని ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని, కేవలం రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారులు ఎక్కువ అవుతారని గమనించి రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తూ ప్రవళిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు 15000, కౌలు రైతులకు 12000, రైతులు పండిరచిన వరి పంటకు బోనస్ ధర ఇస్తూ వరికి 2500 గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
ప్రతి మహిళకు నెలకు 2500, విద్యార్తినిలకు స్కూటీ, గ్యాస్ సిలిండర్ 500 కేటాయిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్యం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలను అవినీతిని గ్రామ గ్రామాన నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలన్నారు.
ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించాలని నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, కొట్టం గంగాధర్, సంజీవ్, ఆకుల నారాయణ, రాములు, శ్రీను, చందర్ నాయక్, ప్రభాకర్, బండి సాయిలు, విట్టల్ రెడ్డి, సతీష్ గౌడ్ సోమప్ప, విట్టల్, శ్రీనివాస్, ఫరూక్, శ్రీకాంత్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రూప్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.