ఇది కామారెడ్డి ప్రజలతోనే సాధ్యం…

కామారెడ్డి, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన 136 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న కెసిఆర్‌ని ఓడిరచే సువర్ణ అవకాశం కామారెడ్డి ప్రజలకు దక్కిందన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని కెసిఆర్‌ కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయాలని కోరారు. గత పదేళ్ల కాలంలో అధికార బిఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, భూ కబ్జాలు, ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణను మార్చిన ఘనత కెసిఆర్‌ది అని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో కాషాయ జండా ఎగర వేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »