నిజామాబాద్, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ సంబందం పెట్టుకొని, బెదిరించి, వివాహితను మోసంచేసిన ఓ కానిస్టేబుల్‌ను రిమాండ్ చేసినట్టు పోలీస్ కమీషనర్ వెల్లడిరచారు. కణీకరం నటరాజు అనే ఎ.ఆర్ కానిస్టేబుల్ (2020) బ్యాచ్‌కు చెందినవాడు. కాగా ఇతని స్వంత ఊరు వేల్పూర్ మండలం, ఇతని బాల్యమిత్రుడితో మంచి స్నేహంగలదు.
స్నేహితునికి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. తరచుగా అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి స్నేహితుని భార్యతో స్నేహం పెంచుకొని ఆమెతో దగ్గరయి ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని ఆమెను బెదిరించి లొంగబర్చుకున్నాడు. ఇది నమ్మి ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత అతనిని వివాహం చేసుకొనమంటే చేసుకోనందుకు ఆమె వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలుపగా వారు నివారించి దుర్భాషలాడి కొట్టిపంపించగా, అక్కడి నుండి సంబందిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇట్టి విషయంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, రేప్ మరియు ఇతర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి ముద్దాయి అయిన కణికరం నటరాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
ఈ విషయం కొత్తగా వచ్చిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్ దృష్టికి రావడంతో సంబందిత అధికారులతో పూర్తిస్థాయి రిపోర్టు తెప్పించుకొని క్రమ శిక్షణ చర్యలలో భాగంగా సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.