కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పౌర సరఫరాల సంస్థ ప్రతి ఏటా ఏం.ఎల్.సి పాయింట్స్‌లో హమాలీలు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి బోనస్‌తో పాటు స్వీట్ బాక్సు, దుస్తులు అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు.
మంగళవారం తన ఛాంబర్లో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్‌తో కలిసి జిల్లాలోని 7 నిత్యావసర సరకులు గోదాములలో పనిచేస్తున్న 73 మంది హమాలీలు, 7 మంది స్వీపర్లకు దసరా కానుకగా స్వీట్ బాక్స్, 6,500 చొప్పున బోనస్, రెండు జతల దుస్తులను వారికి అందజేస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.