డిచ్పల్లి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదారాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ కోసం సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో సమావేశ ప్రధానాంశాలను మీడియా ప్రతినిధులకు వెల్లడిరచారు. ప్రెస్ మీట్లో చైర్మన్ ఆచార్య పాపి రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం. గోపాల్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి రాథోడ్ నాయక్ పాల్గొన్నారు.