వేల్పూర్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని, జీవో నెంబర్ 46 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం ఎంఈఓ రాజా గంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డగాని ప్రైవేటు పాఠశాలల ఆగడాలను మాత్రం ఆగడం లేదని, ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.
ఇప్పటికైనా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, జీవో నెంబర్ 46 అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి వినయ్, రాజు, రవితేజ, విశాల్, తదితరులు ఉన్నారు.