కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళలకు సూచించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, సాయంత్రం స్వీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు.




ఈ సందర్భంగా కలెక్టర్ స్వీప్ బతుకమ్మను మహిళలకు అందజేస్తూ పూలను పూజించే, ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని అన్నారు. తీరొక్క పూలతో తీర్చిదిద్ది ఆనందోత్సవాల మధ్య జరుపుకునే జరుపుకునే ఈ పండుగతో పాటు త్వరలో రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికలలో మీతో పాటు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.