బాన్సువాడ, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ చౌరస్తాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల నుండి 2 లక్షల 90 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పి జగనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం సరిహద్దుల వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, పట్టుకున్న డబ్బులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నట్లు వారు తెలిపారు.
యాభై వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఆధారాలు లేకుండా తీసుకుని వెళ్ళవద్దని వ్యాపారులు కానీ ప్రజలు కాని శుభకార్యాలు ఉన్న అధిక మొత్తంలో డబ్బులు బంగారం తీసుకెళ్తే జప్తు చేయబడటం జరుగుతుందని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. తనిఖీలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి, బీర్కూర్ ఎంపీడీవో భాను ప్రకాష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.