మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి

కామరెడ్డి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వివి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి అయిన పిదప స్ట్రాంగ్‌ రూమ్‌లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో 6,61,163 మంది ఓటర్లున్నారని, 791 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు 25 శాతం, వివి ఫ్యాట్‌లు 40 శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి ర్యాండమైజేషన్‌లో ప్రత్యేక సాఫ్ట్వేర్‌ ద్వారా ఆటోమాటిక్‌గ నియోజక వర్గం, పోలింగ్‌ బూత్‌ వారీగా ఏఏ యంత్రాలు కేటాయించాలో జనరేట్‌ చేసిన జాబితాను అందజేస్తూ శనివారం ఉదయం 8 గంటల వరకెల్లా ఏ.వి.ఏం. గోదాములకు రావాలని కోరారు.

అక్కడ నియోజక వర్గం వారీగా జనరేట్‌ చేసిన జాబితా ప్రకారం కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వి.వి.ఫ్యాట్‌లను ఆయా నియాజక వర్గాలకు గట్టి భద్రత మధ్య తరలించి అక్కడ ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తామని అన్నారు. రెండవ దఫాలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ జరుగుతుందని, నవంబర్‌ 28 న మూడవ ర్యాండమైజేషన్‌లో కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వివి ప్యాట్లు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించుటకు సిద్ధం చేస్తామని అన్నారు.

పోలింగ్‌ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఏజెంట్లు ఎన్నికల ప్రక్రియలో, పోలింగ్‌ సమయంలో ఏమో చేయాలో, తగు శిక్షణ ఇవ్వాలని తహసీల్ధార్లకు సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు, వాహనాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు, డబ్బు పంపిణి, తాయిలాలు ఇవ్వడం వంటివి దృష్టికి వస్తే వెంటనే తెలపాలని, లేకుంటే అభ్యర్థి ఖర్చు క్రిందకు వెళుతుందని తెలిపారు.

సామాజిక మాడిమలలో వచ్చిన అసత్య వార్తల పట్ల అప్రమత్తం ఉండాలని, అభ్యంతరకర పోస్టులు ఉండరాదని హితవు చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్‌ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »