కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకర్లు తమ లాగిన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజక వర్గస్థాయి 2వ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రాప్‌లోన్ వీవర్స్‌కు సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు.
పంట రుణాలు, బంగారంపై రుణాలు, తీసుకొని క్లోజ్ అయిన ఖాతాలు, నూతన ఖాతాలు, ఆధార్ అనుసంధానం, వంటి అంశాలపై దృష్టి పెట్టి తమ లాగిన్‌లో వచ్చిన గ్రీవెన్స్‌పై తమ స్థాయిలో పరిష్కరింపదగిన వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.
సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి భార్గవ్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అదనపు డిఆర్‌డిఓ మురళి కృష్ణ, నాబార్డు డిపిఎం ప్రవీణ్ కుమార్, రవికుమార్, వివిద బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.