కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు భారత ఆహార సంస్థకు కు అందించవలసిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను వేగవంతంగా అందజేయుటకు గాను గోదాములలో అవసరమైన స్థలం, హమాలీలను ఇవ్వవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రకాష్ వర్మను కోరారు.
ఎఫ్.సి.ఐ. మేనేజర్‌గా కొత్తగా వచ్చిన ప్రకాష్ వర్మ శుక్రవారం అదనపు కలెక్టర్‌ను ఛాంబర్లో కలవగా కామారెడ్డి జిల్లా నుండి భారత ఆహార సంస్థకు సి.ఏం.ఆర్. రైస్‌ను శరవేగంతో అందించుటకు గాను గోదాములలో అవసరమైన స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన హమాలీలలను సమకూర్చవలసినదిగా విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్ తదితరువులు పాల్గొన్నారు.