శక్తివంతమైన సమాజ నిర్మాణమే ఆరెస్సెస్‌ ధ్యేయము

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శక్తి వంతమైన సమాజమే అభివృద్ధిని, పురోగతిని సాధిస్తుందని శక్తి హీనమైన సమాజం నిర్వీర్యం అయిపోతుందని అందుకే 1925 లోనే డాక్టర్‌ హెడ్గేవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ును స్థాపించారని ఇందూరు విభాగ్‌ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్‌ అన్నారు.

ఆర్సెసెస్‌ ఇందూరు నగర విజయదశమి ఉత్సవానికి ముఖ్యవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అనాది కాలం నుంచి హిందుత్వం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిందని నేడు చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం ద్వారా మరోసారి భారత్‌ విశ్వ గురువుగా నిలబడిరదని అన్నారు.

శక్తి(దేవి)ని తొమ్మిది రోజులు పూజించి ఆశ్వయుజ శుక్ల దశమినాడు, ఆ తల్లి విజయం సాధించిననాడు, ఈ విజయదశమిని జరుపుకుంటామని, భౌతిక, ఆధ్యాత్మిక శక్తుల ప్రకటిత రూపమైన అమ్మవారు సకల సంకల్పాలను నెరవేర్చి విజయాన్ని చేకూరుస్తుందన్నారు. శక్తి స్వరూపిణి అయిన ఆ దేవి ప్రకటితమవడమంటే స్వచ్చమైన, పవిత్రమైన సంకల్పాలు విజయవంతమవుతాయని, సర్వత్ర సుఖశాంతులు వర్ధిల్లుతాయని, భారతీయ సంప్రదాయంలో స్త్రీ, పురుషుల మధ్య పరస్పర పూరకమైన దృష్టి మొదటి నుండి ఉందన్నారు.

కానీ ఈ సంప్రదాయం క్రమంగా మరుగున పడి మాతృశక్తి’ కి అనేక అవరోధాలు, పరిమితులు ఏర్పడ్డాయని, నిరంతరాయంగా సాగిన విదేశీ దాడుల మూలంగా కొన్ని అనుచిత పద్దతులకు సమ్మతి ఏర్పడి అవి స్థిరపడ్డాయని పేర్కొన్నారు. జాతీయ పునరుజ్జీవన ప్రారంభం నుండి మన జాతీయ నాయకులు మహిళలపై విధించిన ఈ పరిమితులు, ఆంక్షలను పూర్తిగా తిరస్కరించారన్నారు.

మహిళా శక్తికి దైవత్వాన్ని’ ఆపాదించి వారిని అక్కడికే పరిమితం చేయడం ఒక ధోరణి అయితే, వారిని కేవలం ఇంటికే పరిమితం చేయడం మరొక ధోరణి అని, ఈ రెండిరటినీ మన నాయకులు తిరస్కరించారని చెప్పారు. దానికి బదులు అభివృద్ధి, సాధికారతల కోసం అనుసరించవలసిన విధానాలు, పద్దతులపై దృష్టి పెట్టారని వివరించారు.

నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు కూడా సమాన భాగం కల్పించాలని కోరుకున్నారని, అనేక ప్రయోగాలు, పరీక్షల తరువాత ఇప్పుడు స్త్రీ వాదులు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారని చెప్పారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా కార్యకర్తలు మహిళల స్థితిగతులపై 2017లో ఒక సర్వే నిర్వహించారని, ఆ సర్వే ఫలితాలను ప్రభుత్వానికి కూడా అందజేశారన్నారు.

అభివృద్ధి, సాధికారత అవకాశాలు, నిర్ణయాధికారంలో సమాన భాగస్వామ్యం కోరుకుంటున్నారని ఆ ఫలితాలు వెల్లడిరచాయని, కుటుంబ స్థాయితో మొదలుపెట్టి సంస్థాగతమైన అన్నీ స్థాయిల్లో మార్పు వచ్చినప్పుడే ఈ మాతృశక్తితో పాటు సమాజం మొత్తం సరైన దిశలో కదులుతుందని, జాతీయ జాగృతి సాధ్యపడుతుందని అందుకే ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్‌ చట్టంగా మారిందని అన్నారు.

భారతీయులందరం శక్తి ఆరాధకులమని అందువల్లే వందల సంవత్సరాలు విదేశీ మూకలు దాడులు చేసినా నేటికీ మన సంస్కృతి చెక్కుచెదరకుండా ఉందని అన్నారు, కానీ ఇప్పుడు మనం మన సంస్కృతి ములాలలను మర్చిపోతున్న కారణంగా దేశంలో లవ్‌ జిహాద్‌, నక్సలిజం, తీవ్రవాదం పెట్రేగిపోతున్నాయని కావున మనమంతా సమాజంలో మళ్ళీ మన ధర్మము, సంస్కృతి పట్ల అవగాహన కలిగించాలని భావితరాలకు ధర్మనిష్ఠను పెంపొందించాలన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దేవిదాస్‌ చందక్‌ మాట్లాడుతూ హిందుత్వాన్ని కాపాడుకోవాలని మనం చేసే ప్రతీ పండగ వెనక గొప్ప సందేశం ఉంటుందని అందుకే మన పిల్లలు మంచి విషయాలు చెప్పాలని సూచించారు.

కార్యక్రమప్రారంభంలో అతిథులు ఆయుధపూజ నిర్వహించారు, వేదికపై జిల్లా, నగర సంఘచాలకులు డా.గురుచరణం, శ్రీనివాస్‌ వున్నారు. కార్యక్రమంలో నగర కార్యవాహ సత్యం, సహ కార్యవాహలు దత్తు, సుమిత్‌, కార్యకర్తలు, స్వయంసేవకులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »