కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడవలసిన బాధ్యత లేఅవుట్ కమిటీ సభ్యులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం లేఅవుట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ చేసిన స్థలాల్లో 10 శాతం పార్క్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, టౌన్ ప్లానింగ్ అధికారి శైలజ, మున్సిపల్ కమిషనర్లు దేవేందర్ (కామారెడ్డి), రమేష్ కుమార్ (బాన్సువాడ), జగ్జీవన్ (ఎల్లారెడ్డి), ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.