కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో 1వ తరగతి నుండి 10 తరగతి వరకు సిఎస్‌ఐ స్కూల్ చదివి హైదరాబాదులో మైనారిటీ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతుల పొందిన కె వీణని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ వేల్పర్ డిప్యూటీ కలెక్టర్ కె వీణ మాట్లాడారు.
కామారెడ్డి పట్టణంలో చదువుకొని హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతులు పొందినందుకు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ కామరెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తనను సన్మానించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ సలీం మాట్లాడారు.
కామారెడ్డి పట్టణంలోని సిఎస్‌ఐ స్కూల్లో చదివి హైదరాబాదులో మైనార్టీ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్‌గా కే వీణా పదోన్నతులు పొందినందుకు వారికి మా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని. కామారెడ్డి జిల్లా కూడా త్వరలో రావాలని కోరుకుంటున్నామన్నారు. తమ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ డిప్యూటీ కలెక్టర్ వీణాకి ఎల్లవేళలా అండగా ఉంటుందని, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తరపున వీణకి ప్రత్యేక అభినందన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు రవికుమార్, జిల్లా అధ్యక్షులు లింబయ్య, ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు అలిమ్, రాజేందర్, అడ్వైజర్ మదర్ పాషా, కలీం బాటి, సాయిలు, అన్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.