డెంగ్యూ బాధితునికి ప్లేట్‌ లెట్స్‌ అందజేత…

కామారెడ్డి, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు చెందిన శేఖర్‌ (45) డెంగ్యూ వ్యాధితో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా డాక్టర్ల సూచనల మేరకు అత్యవసరంగా బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

కరీంనగర్‌ రక్తదాతల సమూహ నిర్వాహకుడు గాలిపెల్లి కుమార్‌ సహకారంతో కరీంనగర్‌కి చెందిన రాజు సకాలంలో స్పందించి బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ ను అందజేశారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రాజు కుమార్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »