వేల్పూర్, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిర్మల్ జిల్లాలో సాంకేతిక సహాయకులు రాజు పై సర్పంచ్ హత్యాయత్నానికి నిరసనగా జిల్లా జేఏసి పిలుపు మేరకు బుధవారం వేల్పూర్ మండలంలోని ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏపివో అశోక్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకులు రాజుకి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఉపాధి హామీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు సుకెష్, శ్రీనివాస్, స్వరూప, కంప్యూటర్ ఆపరేటర్లు రాము గౌడ్, విజ్ఞాన్, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.