ఆర్మూర్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీలో నివసించే 105 సంవత్సరాల వృద్ధురాలైన చిలుక గంగుబాయి, భర్త చిలుక నర్సయ్య (చెంగల్) శుక్రవారం మృతి చెందింది. ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన చంద్రమౌళి తల్లి గంగుబాయి 105 సంవత్సరాలు జీవించారు.
ప్రస్తుతం చంద్రమౌళి స్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వరం వద్దగల డోలారి ఆశ్రమంలో ఉంటున్నారు. చంద్ర బిందు మహారాజ్‌కు ప్రధాన శిష్యుడు చంద్రమౌళి స్వామి. ఈమెకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గంగుబాయి మృతి వార్త తెలియగానే చంద్రమౌళి శిష్యులు, అనుయాయులు, సన్నిహితులు టీచర్స్ కాలనీలోని ఇంటికి తరలివచ్చి గంగుబాయికి నివాళులర్పించారు. శనివారం ఉదయం 10 గంటలకు టీచర్స్ కాలనిలోని ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుంది.