కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రక ృతి వనం ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేసి పెద్ద మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పది ఎకరాల స్థలం ఉండే విధంగా చూడాలన్నారు. ఈ వనంలో ఎర్రచందనం, టేకు, మహాఘాని వంటి మొక్కలు నాటాలని సూచించారు.
సదాశివనగర్ పల్లె ప్రక ృతి వనం జిల్లాలోనే ఆదర్శంగా ఉందని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల స్థాయి అధికారులను అభినందించారు. మియావాకి విధానంలో పెద్ద మొక్కలు నాటాలని పేర్కొన్నారు. నాలుగో విడత పల్లె ప్రగతిని విజయవంతం చేసినందుకు స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. విరాళాల సేకరణలో అధికారులకు, ప్రజాప్రతినిధుల సహకారం అందించాలని కోరారు.
విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు వైకుంఠ రథాలపై ఉండేవిధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించి ఇరవై ఐదు మొక్కలు నాటాలని, మొక్కలపై వ్యాపారులకు నచ్చిన పేరు పెట్టుకునే విధంగా చూడాలని సూచించారు. కంపోస్టు షెడ్లు , వైకుంఠ దామాలు ఈనెల 25లోగా వాడుకలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. వాటి చుట్టూ గ్రీన్ ఫినిషింగ్ ఉండేవిధంగా చూడాలన్నారు.
పల్లె ప్రక ృతి వనాలు చిట్టి అడవులను తలపించే విధంగా ఉండాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు చనిపోయిన చోట కొత్త మొక్కలు నాటాలని, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని సూచించారు. పంపిణీ చేసిన మొక్కల వివరాలు ఐకేపీ అధికారులు రిజిస్టర్‌లో నమోదు చేసే విధంగా చూసుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఖాళీ స్థలాలు ఉంటే వాటిలో మొక్కలు నాటాలని చెప్పారు.
లేఅవుట్ ఓపెన్ స్థలాలలో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ ఉంటే ఈనెల 25లోగా మరమ్మతులు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని అటవీ అధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో 90 శాతం మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. జిల్లాలో నూట అరవై శాతం మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
పల్లె ప్రగతి పనులు పెండిరగ్‌లో ఉన్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఇన్‌చార్జి డిఎఫ్‌వో సునీల్, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, అటవీశాఖ, విద్యుత్తు అధికారులు పాల్గొన్నారు.