కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైళ్లలో గంజాయితోపాటు నల్లబెల్లం పట్టికలు తరలిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం కామారెడ్డి ఆర్‌పిఎఫ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలు వెల్లడిరచారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాంతంలోని లక్ష్మీపూర్ తాండకు చెందిన బరావత్ భద్రమ్మ, భూక్య శాంత, ఈరమ్మలు శుక్రవారం రైల్లో అక్రమంగా తరలిస్తుండగా పక్క సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నట్లు తెలిపారు.
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వీరు 30 కిలోల పట్టికను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాయచూరు ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు తరలిస్తున్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు వేల కిలోల నల్లబెల్లంతో పాటు పటికను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
నల్ల బెల్లం గంజాయి వద్ద నిందితులు ఎవరు కూర్చోకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపారు. వీరందరిపై నిఘా పెట్టి త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. సుమారు 11 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.
సమావేశంలో ఆర్‌పిఎఫ్ సిఐ సుబ్బారెడ్డి, ఎక్సైజ్ అధికారులు విజయ్ కుమార్, సుందర్ సింగ్, విక్రమ్ కుమార్, ఆర్పిఎఫ్ సిబ్బంది ప్రవీణ్, సుధాకర్, జిఆర్పి సిబ్బంది త్రావు నాయక్, జస్వంసింగ్ ఉన్నారు.