కామరెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. సోమవారం న్యూ ఢల్లీి నుంచి ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా, కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, నోడల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, రిటానింగ్ అధికారి కార్యాలయంలో ఒక గోడ గడియారం ఏర్పాటు చేసి నామినేషన్ల స్వీకరణ సమయంలో ఖచ్చితంగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని, అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండిరగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని, ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, అట్టి జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందించాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు. తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్హిఎతంగా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే అప్పీల్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ టెండర్ బ్యాలట్, పోస్టల్ బ్యాలట్, అత్యవసర ఓటర్లకు కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ వెంటనే బ్యాలట్ పేపర్ల ముద్రణ చేపట్టాలని అదనపు కలెక్టర్, డిపిఓను ఆదేశించారు.
ఓటరు బీజాబితా, అనుబంధ జాబితా సిద్ధం చేసి అభ్యర్థులకు అందించాలన్నారు. ప్రేయసిడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు రెండవ విడత శిక్షణలో ప్రాక్టికల్ గా మాక్ పోల్ నిర్వహణ, ఫై.ఓ. డైర్, వివిధ ఫారాలు నింపడంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పోటీ చేసి అభ్యర్థులు నూతనంగా ఖాతాలు తెరిచి ఆ ఖత ద్వారానే లావాదేవీలు జరిగేలా చూడాలని లేలేదు బ్యాంక్ అధికారికి సూచించారు.
జిల్లాలో అక్రమ నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువుల తనిఖీ ఫంబాగా చేస్తున్నారని, పెద్ద మొత్తలో మద్యం నిలువ చేసే స్థావరాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని ఆబ్కారీ అధికారికి సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సింహారావు, దయానంద్, బఫేవ్య్య, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, లీడ్ బీబ్యాంక్ మేనేజర్ భార్గవ్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రవీంద్ర రాజు, కలెక్టరేట్ ఏ.ఓ.. మసూరి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.