నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ

కామారెడ్డి, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో పనిచేస్తున్న సిపాయిల సేవలు వెలకట్టలేనివాని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంగా సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడుతూ, దేశ రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిపాయిల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్చగా జీవించగలుగుతున్నామని అన్నారు.

పబ్లిక్‌ సర్వీస్‌ లో ఉన్న మనం కూడా దేశం కోసం కొంత సమయం వెచ్చించాలని, అవసరమైతే అదనంగా పనిచేయాలని కోరారు. మన రాజ్యాంగం సమాజంలో 18 ఏళ్ళు నిండిన అందరికి సమానంగా ఓటు హక్కు కల్పించిందని, నైతిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్దార్‌ వల్లభాయి పటేల్‌ దార్శనికత వల్ల లభ్యమైన దేశ ఏకీకరణ, దేశ సమగ్రత, భద్రత, ఐకమత్యానికి అంకితమవుతాయని ప్రతిజ్ఞ చేయించారు.

అదేవిధంగా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేస్తానని ఉద్యోగస్తులలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, డిఆర్‌ డిఓ సాయన్న, వివిధ కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »